జగన్నినాదాలతో దద్దరిల్లిన 'చంచలగూడ' ప్రాంతం

హైదరాబాద్, 27 మే 2013:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని నిర్బంధించిన చంచల్‌గూడ జైలు పరిసరాలు సోమవారంనాడు జగన్నినాదాలతో మారుమోగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చంచల్‌గూడ జైలు వద్దకు చేరుకుని భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. జై జగన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరి‌ల్లింది. అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరో పక్కన శ్రీ వైయస్ జగ‌న్ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని నెక్లెస్‌రెడ్డులో భారీ స్థాయిలో నిరసన చేపట్టినట్టు పార్టీ నాయకురాలు విజయారెడ్డి తెలిపారు. సాయంత్రం 6 గంటలకు నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్సు ప్లాజా నుంచి కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ర్యాలీలో పాల్గొంటారని ‌తెలిపారు.

Back to Top