'జగన్మోహన్‌రెడ్డి స్వే‌చ్ఛ హక్కుకు విఘాతం'

అనంతపురం : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడంపై రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా చేపట్టిన 'జగన్‌ కోసం.. జనం సంతకం' కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేషంగా స్పందన లభిస్తోందని వైయస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజల నుంచి శ్రీ జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్‌, టిడిపి కుమ్మక్కై అక్రమ కేసులో ఇరికించి, ఆయన బయట తిరగకుండా స్వేచ్ఛా హక్కును హరించారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సిపి అనుబంధ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు.‌

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గురునాథరెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో హక్కులను కాలరాస్తున్న పాలకులకు త్వరలోనే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. శ్రీ జగన్ అరెస్టు అక్రమమంటూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేస్తున్నారన్నారు. త్వరలోనే‌ శ్రీ జగన్ బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ‌కార్యక్రమంలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ జిల్లా అ‌డ్‌హాక్ కమిటీ కన్వీన‌ర్ శంకరనారాయణ, ఎర్రిస్వామి‌ రెడ్డి, సాలార్ బాషా, ట్రే‌డ్ యూనియ‌న్ జిల్లా అధ్యక్ష , ఉపాధ్యక్షులు, కొర్రపాడు హుసే‌న్ పీరా, కోనా రాజారెడ్డి, బలరాం, కనేక‌ల్ లింగారెడ్డి, విశ్వనా‌థ్‌రెడ్డి, కృష్ణవేణి, కదిరి నిర్మల తదితరులు పాల్గొన్నారు.
Back to Top