జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసే వరకూ నిద్రపోను

తిరుపతి, 20 మార్చి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ మరణానంతరం ఆ కుటుంబానికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.  మహానేత కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ పెద్దలకు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. పుంగనూరు శాసనసభా సభ్యత్వానికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన తరువాత తొలిసారిగా తిరుపతికి వచ్చిన ఆయనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విభాగం అభినందన సభను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ... పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేంత వరకూ నిద్రపోనని ప్రకటించారు. ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఇతర నేతలు రోజా, నారాయణస్వామి, ఎమ్మెల్సీ తిప్పారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Back to Top