జగన్‌కు బెయిల్‌ కోసం పులివెందులలో ప్రార్థనలు

పులివెందుల (వైయస్‌ఆర్‌ జిల్లా) : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ పులివెందులలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. పులివెందులలోని శ్రీ వై‌యస్ జగన్ ఇంటిలో బుధవారం ఉదయం నుంచి ప్రార్థనలు చేశారు. ప్రముఖ ‌చిన్న పిల్లల వ్యాధులన నిపుణుడు డాక్ట‌ర్ ఈసీ గంగిరెడ్డి సతీమణి డాక్ట‌ర్ ఈసీ సుగుణమ్మ ఆధ్వర్యంలో పులివెందులలో‌ సుమారు వందమంది ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ప్రార్థనలు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి.‌ హైకోర్టులో స్టాట్యుటరీ బెయిల్‌పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి బెయిల్ రావాలని ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు సుగుణమ్మ తెలిపారు.
Back to Top