జగన్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం: జూపూడి

ఒంగోలు, 10 ఏప్రిల్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి అయిన శ్రీ వైయస్ జగన్మోహన రెడ్డి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు తెలిపారు. ప్రకాశం జిల్లా కొండేపిలో బుధవారం  జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీ జగన్ను ముఖ్యమంత్రిని చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఆ మేరకు కార్యవర్గ సభ్యులతో ఆయన ప్రమాణం చేయించారు.

Back to Top