'జగన్ కోసం' కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతకం

ఒంగోలు:

తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'జగన్ కోసం జన సంతకం' కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి(కాంగ్రెస్) పాల్గొన్నారు.  తాను కూడా సంతకం చేశారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారనీ, ఆయనకు బెయిలు ఇవ్వకుండా ఎప్పటికప్పుడు అడ్డం పడుతున్నారనీ ఆరోపిస్తూ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తన తల్లి వెంకాయమ్మతో కలిసి పాల్గొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్
పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వారు సంతకం చేశారు.
అనంతరం బాలినేనికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి కొద్దిసేపు
ముచ్చటించారు.

Back to Top