జగన్‌ కోసం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి జాగరణ

రాయదుర్గం, 1 జనవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి త్వరగా విడుదల కావాలని, మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న శ్రీమతి షర్మిల త్వరితంగా కోలుకోవాలని వేడుకుంటూ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జాగరణ చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలులో నిర్బంధించినందుకు నిరసనగా పార్టీ పిలుపు మేరకు తాను కొత్త సంవత్సరం సందర్భంగా మంగళవారంనాడు వేడుకలకు దూరంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మల్లాపురంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేసి, రాత్రికి జాగరణ చేస్తున్నట్లు వివరించారు. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవద్దని పార్టీ అధిష్టానం నిర్ణయించిన మేరకు తాను తన కుటుంబ సభ్యులతో కలిసి రాత్రికి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జాగరణ చేస్తూ స్వామివారిని ప్రార్థిస్తామని వెల్లడించారు.
Back to Top