దీపావళి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ దీపావళి
శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటన సారాంశం
ఇది...

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దీపావళి
శుభాకాంక్షలు. దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా
జరుపుకొనే ఈ పర్వ దినం సందర్భంగా అందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని,
ఈ దీపావళి ప్రతీ ఇంటా కోటి కాంతులు నింపాలని కోరుకొంటున్నాను.

Back to Top