జగనన్న ప్రభుత్వంలో రైతన్నే రాజు : ష‌ర్మిల‌

జానపాడు (గుంటూరు జిల్లా), 28 ఫిబ్రవరి 2013: జగనన్న ఏర్పాటు చేసే రాజన్న రాజ్యంలో రైతే మళ్లీ రాజు అవుతాడంని శ్రీమతి ష‌ర్మిల భ‌రోసా ఇచ్చారు. పొలాలు, అన్నదాతల ప్రాణాలు చాలా విలువైనన్నారు. పొలాలు, ప్రాణాలను పోగట్టుకోవద్దని శ్రీమతి ష‌ర్మిల రైతన్నలకు సూచించారు. దివంతగ మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి తనయ, జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 77వ రోజు గురువారం గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో జాన‌పాడు నుంచి ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా జాన‌పాడులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి ష‌ర్మిల మాట్లాడారు.

రాష్ర్టప్రభుత్వ నిర్లక్ష్య వైఖ‌రి కారణంగా స్కాలర్‌షిప్‌లు అందక తమ చదువులు మధ్యలోనే ఆపేయాల్సి వస్తోందంటూ విద్యార్ధులు ఆవేద‌న చెందుతున్నార‌న్నారు.‌ కిరణ్‌ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయని రైతులు శ్రీమతి ష‌ర్మిల‌తో మొర పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల లోగానే జగనన్న బయటకు వస్తారని, అందరి కష్టాలు తీరుస్తాడని శ్రీమతి ష‌ర్మిల భరోసా ఇచ్చారు.
Back to Top