జగనన్న మీ కష్టాలు తీరుస్తారు

విజయవాడ, 27 మార్చి 2013:

విజయవాడ రాజరాజేశ్వరి పేటలోని హైస్కూలులో శ్రీమతి వైయస్ షర్మిల రచ్చబండతో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 103వ రోజు కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు. మహిళలు చెప్పిన సమస్యలన్నీ ఆమె శ్రద్ధగా విన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సమస్యలను చక్కదిద్దుతారని శ్రీమతి షర్మిల వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం కట్టించిన ఇళ్ళు నాసిరకంగా ఉన్నాయనీ, వచ్చే డబ్బులు మరమ్మతులకే సరిపోతోందనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ళ రుణాల వాయిదాలు కట్టాలని బ్యాంకర్లు వేధిస్తున్నారని మహిళలు ఆమె దృష్టికి తెచ్చారు. పేదల కాలనీలో ఉన్న మూడు వైన్ దుకాణాల వల్ల మగవారు తమ సంపాదనను తాగుడుకే తగలేస్తున్నారని కూడా వారు ఆమెకు ఫిర్యాదు చేశారు. ఈ సర్కారు వల్ల పేదలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. బ్యాంకర్ల వేధింపులు లేకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మహిళలకు శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. పేదల కాలనీలో వైన్ దుకాణాలను తొలగింపజేస్తామన్నారు.

Back to Top