రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి

విశాఖ: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని వైయస్‌ఆర్‌సీపీ నేత విజయనిర్మల అన్నారు. 
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా  ఆనందపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో చాలా మంది అర్హులకు పింఛన్లు రావడం లేదన్నారు. విలువైన భూములను టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని విమర్శించారు. పేదలకు ఉండటానికి సెంట్‌ భూమి లేకపోతే పచ్చ నేతలు మాత్రం మేడమిద్దెలు కట్టుకుంటున్నారన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మనందరి కోసం వైయస్‌ జగన్‌ ఎండా, వాన లెక్క చేయకుండా పాదయాత్ర చేసుకుంటూ భీమిలి నియోజకవర్గం వచ్చారన్నారు. మన సమస్యలన్నీ కూడా వైయస్‌ జగన్‌ సీఎం కాగానే పరిష్కరిస్తారని చెప్పారు. ఇక్కడ చదువుకోవడానికి ప్రభుత్వ కాలేజీ లేదని తెలిపారు. భీమిలికి వెళ్లి చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు. చంద్రబాబు ఈ నియోజకవర్గానికి 300 హామీలు ఇచ్చారన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పారు. గ్రామాల్లో 108 కనిపించడం లేదన్నారు. టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ధ్వజమెత్తారు. మహిళలకు భద్రత కలగాలంటే వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు మాదిరిగా 600 హామీలు వైయస్‌ జగన్‌ ఇవ్వలేదని, చేయగలిగినవే కేవలం 9 పథకాలు ప్రకటించారన్నారు. ఈ నవరత్నాలతో అందరికి మేలు జరుగుతుందన్నారు. 
Back to Top