జగన్‌ సీఎం కావాలని కాలినడన తిరుమలకు

చౌడేపల్లె: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రికావాలని కోరుతూ చౌడేపల్లె మండలం ఏ.కొత్తకోట సెగ్నెంట్‌ ఎంపిటీసీ ధనలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం కాలినడకన తిరుమలకు వెళ్ళనున్నారు. మంగళవారం ఆమె తన భర్త చెంగారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ తన స్వగ్రామంనుంచి సుమారు వంద మందితో తిరుమలకు కాలినడన వెళ్ళి జగన్‌ సీఎంకావడంతో పాటు ఎమ్మె ల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి అయ్యేందుకు స్వామివారి కృప కావాలని కోరుతూ తిరుమలకు వెళ్ళనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి తరలివస్తున్న అందరికీ ఆమె సొంత నిధులతో భోజనం, తదితర సదపాయాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు గురువారం ఉదయం 6 గంటలకు దుర్గసముద్రం గ్రామానికి తరలిరావాలని కోరారు.

Back to Top