విజయవాడః కల్తీ మద్యం బాధితులను పరామర్శించేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడకు చేరుకున్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కల్తీమద్యం మహమ్మారికి బలైన మృతుల కుటుంబీకులు, క్షతగాత్రులను వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. <br/>నగరంలోని కృష్ణ బార్ లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంగతి తెలుసుకొన్న వెంటనే వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ నాయకుల్ని అక్కడకు పంపించారు. <br/>