హోదా మీద ట్వీట్ చేసిన వైఎస్ జగన్


హైదరాబాద్) ప్రత్యేక హోదా ఆవశ్యకత, అధికార పక్ష నాయకుల దొంగాట మీద ప్రతిపక్ష
నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మండి పడ్డారు. ఈ మేరకు సామాజిక వెబ్
సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తిన
ప్రశ్నలకు కేంద్రం నుంచి లిఖిత పూర్వక సమాచారం వచ్చింది. ఈశాన్య రాష్ట్రాలకు
ప్రత్యేక హోదాకొనసాగుతోందనికేంద్రం స్పష్టం చేసింది. అటువంటప్పుడు ఆంద్రప్రదేశ్ కు
ప్రత్యేక హోదా దక్కే అవకాశం లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలు
పంపటాన్ని ఆయన తప్పు పట్టారు.

ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే దొంగాటనుకొనసాగించటంపై జగన్
మండిపడ్డారు. అటు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రావటం కానీ, ఇటు కేంద్రం నుంచి తమ
మంత్రుల్ని ఉపసంహరించటం కానీ చేయటం లేదని విమర్శించారు. 

Back to Top