సాహితీ వేత్త సుబ్బరామయ్య మృతిపట్ల వైయస్ జగన్ సంతాపం

విఖ్యాత కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కార
గ్రహీత పెద్దభొట్ల సుబ్బరామయ్య మృతిపట్ల వైయస్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌
రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 350కి పైగా
కథనలు, 8 నవలలు రచించి సాహితీ రంగానికి
పెద్దభొట్ల విశేష సేవలందించారని జగన్‌ కొనియాడారు. తెలుగు సాహిత్య చరిత్రలో
పెద్దిభొట్ల ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు. పెద్దిభొట్ల కుటుంబ సభ్యులకు వైయస్‌
జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Back to Top