చిన్నారుల గోడు విని చలించిన వైయస్‌ జగన్‌

పశ్చిమగోదావరి: తమ ఇంటి పక్కనే ఉన్న వైన్‌షాపును తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఇద్దరు చిన్నారులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను ఇద్దరు చిన్నారులు కలిశారు. తమ తండ్రి రోజూ ఇంటి పక్కనే ఉన్న వైన్‌షాపులో తప్పతాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నాడని చెప్పారు. స్కూల్‌లో ఉన్న పిల్లలు కూడా వీళ్ల నాన్న తాగుతారు.. వీరితో మాట్లాడొద్దు అని దూరంగా ఉంటున్నారని జననేతకు వారి ఆవేదన చెప్పుకున్నారు. మద్యానికి అలవాటుపడి స్కూల్‌ ఫీజు కట్టడం లేదు.. దుస్తులు కూడా కొనిపించడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. చిన్నారుల బాధ విన్న వైయస్‌ జగన్‌ మద్యం షాపు ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా అమ్మఒడి పథకం ద్వారా మిమ్మల్ని చదివించే బాధ్యత నాది అంటూ వారికి ధైర్యం చెప్పారు. 
Back to Top