మొక్కవోని దీక్షతో వైయస్‌ జగన్‌ పాదయాత్ర

గుడివాడ: మొక్కవోని దీక్షతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్నారని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. వైయస్‌ జగన్ను చూసేందుకు వృద్ధులు సైతం వేచి చూస్తున్నారన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవయ్య మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా స్పందన చూసి వైయస్‌ జగన్‌లో ఉత్సాహం రెట్టింపవుతుందన్నారు. పాదయాత్ర మొదటి రోజు ఎలా ఉన్నారో.. అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో మండుటెండలో నడుస్తూ చిరునవ్వుతో ప్రజలందరినీ పలకరిస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, పసిపిల్లలపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టాల్సిందిపోయి తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ప్రతిపక్షంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
Back to Top