రైతులకు అండగా నిలబడేందుకే దీక్ష: వైఎస్ జగన్‌


చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో మోసపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు, మహిళలు, ప్రజలకు అండగా నిలబడాలన్న లక్ష్యంతో దీక్ష చేపట్టినట్లు  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రైతుదీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు, మహిళలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు  రాష్ట్ర  ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తానని చెప్పారు.
Back to Top