స్థానికులతో మమేకం అయిన వైఎస్ జగన్

 కడప:  వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు.
అనేక మంది స్థానికుల్ని ఆయన పలకరించారు. సమస్యలు అడిగి తెలుసుకొన్నారు.  ..‘ఈ   ప్రభుత్వంలో
పింఛన్లు తొలగించారు.. పంట రుణాల మాఫీ అంతంత మాత్రమే..డ్వాక్రా రుణాల వడ్డీ పెరిగిపోయింది..’అంటూ
కొందరు మొరపెట్టుకొన్నారు. జననేత వెళ్లిన ప్రతి చోట ఇదే దృశ్యం కనిపించింది.. ప్రజల
కన్నీటిని తుడుస్తూ ‘నేనున్నానని..మీకేం కాదని, భయపడవద్దని’ ఆయన భరోసా ఇచ్చారు..మీ
తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తానని..మీ సమస్యల పరిష్కారం కోసం  నిరంతరం పోరాడుతానని ప్రతినబూనారు..ఇలా కడప  జిల్లాలో  
సాగిన ఆయన పర్యటన విజయవంతమైంది.. పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహాన్ని నింపింది.

Back to Top