వైఎస్ జగన్ క్రిష్ణా జిల్లా పర్యటనహైదరాబాద్) ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం నాడు క్రిష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 8.30ని.లకు విజయవాడ చేరుకొంటారు. అక్కడ నుంచి అవనిగడ్డ నియోజకవర్గం లోని కొత్త మాజేరు గ్రామం చేరుకొంటారు. అనుమానాస్పద వ్యాధి బారిన పడి మరణించిన 20 మంది కుటుంబాల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఈ మేరకు పార్టీ ప్రోగ్రామ్ ల రాష్ట్ర కోర్డినేటర్ టి. రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. 
Back to Top