మాజీ ఉప ప్రధాని, సామాజిక నేత బాబూ జగజ్జీవన్రామ్కు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం హైదరాబాద్ లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగజ్జీవన్రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. బాబూ జగజ్జీవన్ రామ్ చిత్ర పటానికి వైఎస్ జగన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అనేకమంది సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ జగన్ ...దేశానికి బాబూ జగజ్జీవన్రామ్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన చేసిన సేవల్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు.