వైయస్‌ జగన్‌ సింహంలా దూసుకుపోతున్నారు

అనంతపురం: చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రజల శ్రేయస్సు కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ సింహంలా ముందుకు దూసుకుపోతున్నారని ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. రాజన్న బిడ్డ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ విధంగా తపిస్తున్నారో అందరికీ తెలుసన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా లెక్క చేయకుండా పాదయాత్ర ద్వారా అందరికీ కలుస్తూ వారి కష్టాలు తెలుసుకుంటున్నారని చెప్పారు. అనంతపురం జిల్లాలో వైయస్‌ఆర్‌ సీపీ తలపెట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ.. ప్రజల కోసం తపించే వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకుసాగాలన్నారు. నరేంద్రమోడీ, చంద్రబాబు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని నిలువునా ముంచారని మండిపడ్డారు. ముస్లింలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ముస్లింలకు అన్యాయం చేసిన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు. గతంలో వైయస్‌ఆర్‌ పాలనలో మైనార్టీలు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. హజ్‌ సబ్సిడీ ఎందుకు ఎత్తేశారని ప్రశ్నించారు. రాష్ట్ర కెబినెట్‌లో ఒక్క ముస్లిం మైనార్టీకి చెందిన వ్యక్తి లేకపోవడం దురదృష్టకరన్నారు. ముస్లింలంటే చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top