సంస్థాగతంగా పటిష్టం చేస్తున్న వైఎస్ జగన్

ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేస్తూనే పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకొంటూ వస్తున్నారు. ఒక వైపు జనం తరపున అలుపెరగని పోరాటం చేస్తున్న జన నేత, మరో వైపు పార్టీ శ్రేణులకు అదే స్ఫూర్తిని పంచుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రదాన సమస్యలుగా నిలుస్తున్న అంశాల మీద పార్టీ అధ్యక్షులు నేరుగా తలపడుతూ ఉద్యమిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్ని కూడగడుతూ ఉద్యమ దుందుభి మోగిస్తున్నారు. మరో వైపు, జిల్లాల వారీగా అంశాల్ని గుర్తించి వాటి మీద పార్టీ యంత్రాంగాన్ని సమాయత్త పరుస్తున్నారు.

తాజాగా జరుగుతున్న జిల్లాల వారీ సమీక్షల్లో ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిని సమగ్రంగా సమీక్షిస్తున్నారు. మొన్న పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో సమీక్ష నిర్వహించారు. అక్కడ పొగాకు రైతులు, జామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో తాడిపూడి జలాశయం కింద రైతులకు ఎదురయ్యే ఇబ్బందులపై ఆరా తీశారు. గుంటూరు జిల్లా నాయకుల్ని పిలిపించి రాజదాని ప్రాంతంలో రైతుల తరపున చేయాల్సిన పోరాటం మీద సమీక్షించారు. రైతులకు అన్ని విదాలుగా అండగా నిలవాలని ఆదేశించారు.

ఈ విధంగా అన్ని ప్రాంతాలు, విభాగాల్ని పటిష్టం చేస్తూ అధ్యక్షులు జగన్ సమాయత్త్ పరుస్తున్నారు. నాయకులతో నేరుగా సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేస్తున్నారు. 

Back to Top