జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు

హైదరాబాద్ 13 అక్టోబర్ 2013:

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే ఈ విజయ దశమి పండుగ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన అభిలషించారు. చెడు ఎంత బలమైనదైనా అంతిమ విజయం మంచిదేనని ఆయన పేర్కొన్నారు. లోకంలోని ప్రజలందర్నీ రక్షించే దుర్గామాత రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో తులతూగాలన్నారు. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకూ సైతం శ్రీ జగన్మోహన్ రెడ్డి పండుగ శుభాకాంక్షలను అందజేశారు.

Back to Top