జగనంటే పిచ్చి ప్రేమ

– అభిమాన నేతతో అక్షరాభ్యాసం చేయించడం ఆనందం
– అశోక్‌ కుమార్, దివ్యజానకి దంపతులు
తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ అంటే పిచ్చి ప్రేమ అని, తమ అభిమాన నాయకుడిని దగ్గర నుంచి చూడటమే కాదు..తమ బిడ్డకు ఆయనతో అక్షరాభ్యాసం చేయించడం ఆనందంగా ఉందని కాకినాడకు చెందిన అశోక్‌కుమార్, దివ్యజానకి దంపతులు పేర్కొన్నారు. గురువారం వారు పెద్దాపురంలోని దర్గా సెంటర్‌లో వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పథకాలతో లబ్ధి పొందామని పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకుని ఈ స్థాయికి వచ్చామని చెప్పారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు జాబు ఇస్తానని ఓట్లు వేయించుకున్నారని, ఎవరికి జాబు ఇచ్చారో క్లారిటీ లేదన్నారు. వైయస్‌ జగన్‌ అంటే పిచ్చి ప్రేమ అని, అందుకే తమ అభిమాన నాయకుడితో తన బిడ్డకు అక్షరాభ్యాసం చేయించామన్నారు. దివ్య జానకి మాట్లాడుతూ..మానాన్న గారికి ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఉచితంగా ఆపరేషన్‌ చేయడంతో బతికాడని చెప్పారు. వైయస్‌ఆర్‌ లేకుంటే రెండు ఎకరాలు అమ్ముకోవాల్సి వచ్చేదన్నారు. మా తమ్ముడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో హ్యాపీగా చదువుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు వచ్చిన తరువాత ఎలాంటి సంక్షేమ పథకం అందలేదన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితే మహానేత మాదిరిగానే పాలిస్తారని ఆమె తెలిపారు. 

తాజా ఫోటోలు

Back to Top