విదేశాల్లో వైఎస్ జగన్ జన్మదినోత్సవాలు

అమెరికాలోని వైఎస్ జగన్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు .. పార్టీ అధ్యక్షులు, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పుట్టిన రోజును ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్బంగా సేవ కార్యక్రమాలు చేపట్టారు. మేరీల్యాండ్ ఫుడ్ బ్యాంక్ కు 250 ఎల్ బీ మేర ఆహార పదార్థాల పార్శిల్స్ అందచేశారు. సేవ కార్యకలాపాలకు ఈ ఫుడ్ పార్శిల్స్ ఉపయోగించాలని కోరారు. అంజిరెడ్డి సంగంరెడ్డి, రవి మరక, సుదర్శన్ దేవిరెడ్డి, రామ్ గోపాల్ దేవపట్ల, విజయ్ మోహన్ కోకటం, కిరణ్ ముక్తాపురం, జనార్దన్ నానికాల్వ, శ్రీనివాస్ నగరూరు, భాస్కర్ యేటూరు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
Back to Top