రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు జగన్ పిలుపు


ప్రత్యేక హోదా మీద పెదవి విప్పని కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాల వైఖరికి నిరసనగా శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
తెలపాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. ఈ
మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తారు,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తెస్తారు, ప్రత్యేక హోదా మీద ప్రకటన
చేస్తారు అని  రాష్ట్ర ప్రజలంతా ఆశించారు.
మోదీగారు వచ్చారు, వెళ్లారు, పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని తెచ్చారు. ఢిల్లీ
పక్కన ప్రవహించే యమున నది నుంచి నీళ్లు కూడా తెచ్చారు. కానీ పార్లమెంటు సాక్షిగా
ప్రత్యేక హోదా విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అంతా కలిసి రాష్ట్రాన్ని
విడగొడుతూ ఇచ్చిన మాట ను మాత్రం మరిచారు.

       ఎన్నికల వేళ
ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ను ఎన్నికలు అయిపోయిన తరువాత పక్కన పెట్టేశారు. ప్రధానమంత్రి
నోట వస్తుందన్న ప్రకటన రాలేదు. ఈ విషయంలో ఒత్తిడి తీసుకొని రావాల్సిన ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారు తన కేసుల నుంచి బయటకు రావటం కోసం ప్రత్యేక హోదాను
అమ్మేశారు. 5 కోట్ల రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ యువత, చదువుతున్న పిల్లల ఆశల మీద
నీళ్లు చల్లారు. విభజన సమయంలో చట్టబద్దంగా మనకు లభించి, ఆంధ్రప్రదేశ్ కు హక్కుగా
రావలసిన అవే హామీలకు కొత్తగా పేరు మార్చి ‘ప్యాకేజీ’ అని పేరు పెట్టి అవే ఇస్తామని
మభ్య పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది భావ్యమేనా..?

ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా
ప్రతీ చోట నిరసనలు తెలపాల్సిందిగా, మన రాష్ట్ర ప్రజల బాధ, మనో వేదన మోదీ గారికి,
బాబు గారికి అర్థం అయ్యేట్లుగా తెలియ చెప్పాల్సిందిగా ప్రతీ అక్క..చెల్లికి, ప్రతీ
అన్న..తమ్ముడికి, ప్రతీ అవ్వ...తాతకు ఈ సందర్భంగా వినయ పూర్వకంగా పిలుపు
ఇస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటనలో వివరించారు

ప్రత్యేక హోదా వచ్చే వరకు ఈ పోరాటాన్ని కలిసికట్టుగా
సాగిద్దామని పిలుపు ఇస్తున్నట్లు వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు..

 

Back to Top