కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

మచిలీపట్నంః నిత్యం జనంలోనే ఉంటూ ప్రజాసమస్యలపై వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు.  జగన్ బందర్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. . పోర్టు, అనుబంధ పరిశ్రమల కోసం స్థానికంగా 30 వేల ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే 14వేల ఎకరాల ప్రైవేటు భూమికి నోటిఫికేషన్ జారీ చేసింది. తమ భూముల జోలికి రావద్దంటూ రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతు ఇచ్చేందుకు జగన్ బందర్ వెళ్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, అధికార ప్రతినిధి పేర్ని నాని ఓ ప్రకటనలో తెలిపారు. 

బుధవారం ఉదయం  జగన్ కరగ్రహారంలోని ఫరీద్ బాబా దర్గా వద్ద రైతులతో మాట్లాడతారు.  తుమ్మలచెరువు వినాయకుడి గుడి సెంటర్ చేరుకొని అక్కడ రైతులతో ముచ్చటిస్తారు.1.30 గంటలకు పొట్లపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో సమావేశమవుతారు. 
Back to Top