జగన్ సైన్యం ఇఫ్తార్ విందు

సుండుపల్లి: కువైట్, మాళియా ప్రాంతాల్లో ఉన్న లైలారెస్టారెంట్‌లో వైయస్సార్‌జిల్లా అధికారప్రతినిధి కె.ఆప్జల్‌ఖాన్‌ కువైట్‌కు విచ్చేసిన సందర్భంగా జగన్ సైన్యం కువైట్‌ భాష, రియాజ్, కె.భాషల ఆధ్వర్యంలో ఇఫ్తార్‌విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవనోపాధి కొరకు వచ్చిన భాషరియాజ్‌ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో జగన్‌సైన్యం పేరుతో సోషల్‌మీడియా ద్వారా పనిచేయడం హర్షించదగ్గ విషయమన్నారు. వైయస్సార్‌కాంగ్రెస్ పార్టీకి కువైట్‌లో విపరీతమైన అభిమానం ఉంది. 2019లో జగన్‌ ముఖ్యమంత్రిగా చూడాలని దృఢసంకల్పంతో ఉన్నామని జగన్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యమని తెలిపారు. వీరితోపాటు గవర్నింగ్‌ కౌన్సిల్‌సభ్యుడు రెహమాన్‌ఖాన్, ప్రధానకోశాధికారి మహేశ్వరరెడ్డి, సోషల్‌మీడియా ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మైనార్టీ ఇన్‌చార్జి గబ్బార్, సలహాదారుడు ఇనాయిత్, మహబూబ్‌భాషలు పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్‌విందులో వైయస్సార్సీపీ గల్ఫ్‌ కువైట్‌ కన్వీనర్‌లు గయాజ్, ఇలియాస్, బాలిరెడ్డి, గోవింద నాగరాజు, వైయస్సార్‌సీపీ కమిటీసభ్యులు రెహమాన్‌ఖాన్‌లు పాల్గొన్నారు.

Back to Top