పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు దేశంలోనే అత్య‌ధికంగా ఉన్న రాష్ట్రం..!

వ్యాట్ ధ‌ర‌ల స‌వ‌ర‌ణ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ వైఖ‌రిపై ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మండిప‌డ్డారు. బిల్లుల‌ను వేగంగా చ‌దువుతూ, పాస్ చేయించుకొంటున్నార‌ని ఇది స‌రి కాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రెండు నిముషాలు మాట్లాడేదానికి కూడా అవ‌కాశం ఇవ్వ‌టం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు  దేశంలోనే అత్య‌ధికంగా ఉన్నాయ‌ని ఆయ‌న గుర్తు చేశారు. పెట్రోల్ మీద లీట‌ర్ కు 31శాతం వ్యాట్, అద‌నంగా 4 రూపాయిలు వ‌డ్డిస్తున్నార‌ని, డీజిల్ మీద లీట‌ర్ కు 22.5 శాతం వ్యాట్, అద‌నంగా 2 రూపాయిలు వ‌డ్డిస్తున్నార‌ని జ‌గ‌న్ స్పష్టం చేశారు. ఈ విష‌యాలు అంద‌రికీ తెలియ‌టం ఇష్టం లేక‌నే మైక్ ఇవ్వ‌కుండా అడ్డుకొంటున్నార‌ని జ‌గ‌న్ అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top