సమస్యల వెల్లువ

–వైయస్‌ జగన్‌ను కలిసిన ఆర్టీసీ కార్మికులు, కాంట్రాక్ట్‌ లెక్చరర్స్, వీఆర్‌ఏలు
– ఏడాది పాటు ఓపిక పట్టాలని జననేత హామీ
వైయస్‌ఆర్‌ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన ఆర్టీసీ కార్మికులను టార్గెట్‌ చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఐదో రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆర్టీసీ కార్మికులు మార్గమధ్యలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా వైయస్‌ఆర్‌ జిల్లా ఆర్టీ కార్మికులను చంద్రబాబు టార్గెట్‌ చేశారని వాపోయారు.  వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ కూడా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పాదయాత్రకు కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ మద్దతు ప్రకటించారు. ఇక వీఆర్‌ఏల అసోసియేషన్‌నాయకులు కూడా మార్గం మధ్యలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. 78 రోజులు సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ మన ప్రభుత్వం రాగానే పే స్కేల్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆయా గ్రామాల ప్రజలు తమకు పింఛన్లు రావడం లేదని, పక్కా ఇల్లు మంజూరు చేయలేదని వైయస్‌ జగన్‌ ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. 
 
Back to Top