రాయలసీమకు తీరని అన్యాయం

  • ప్రారంభోత్సవాలే తప్ప పొలాలకు నీరు పారించింది లేదు
  • వచ్చిన ప్రతిసారి ప్రభుత్వం ధనం దుర్వినియోగం
  • రాయలసీమ రత్నాల సీమ చేస్తానంటూ మాయమాటలు
  • ముచ్చుమర్రి వైయస్ఆర్ పుణ్యమే
  • మూడున్నరేళ్లయినా పట్టించుకోని చంద్రబాబు
  • ముఖ్యమంత్రిని నిలదీస్తాననే తనను ఆహ్వానించలేదు
  • వైయస్సార్సీపీ దళిత ఎమ్మెల్యేనని అణగదొక్కాలని చూస్తున్నాడు
  • చంద్రబాబుపై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఫైర్
కర్నూలుః చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నాడని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. రాయలసీమను రతనాల సీమను చేస్తానని మూడున్నరేళ్లుగా చెప్పడమే తప్ప బాబు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి చేసిన ప్రారంభోత్సవాలే చేస్తున్నారు తప్ప  నీరు అందించిన పాపాన పోవడం లేదని దుయ్యబట్టారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు బాబు మోటర్లు ఆన్ చేసి 24 గంటలు గడవకముందే అధికారులు నీటిని నిలిపివేశారు. ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ లో నీళ్లు అందకపోవడంతో హంద్రీనీవాకు నీటిని నిలుపుదల చేశారు. ముచ్చుమర్రి పైలాన్ ప్రారంభోత్సవ కార్యక్రమ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేనైన తనను ఆహ్వానించకపోవడాన్ని ఐజయ్య తీవ్రంగా తప్పుబట్టారు. వైయస్సార్సీపీ దళిత ఎమ్మెల్యేననే  ముఖ్యమంత్రి రాజకీయంగా తనను అణగదొక్కాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

నదులు, చెరువులు ఉప్పొంగినప్పుడు ఎవరైనా జలసిరి చేస్తారని, కానీ నీళ్లే లేనప్పుడు జలసిరి చేసి ఏం లాభమని ఐజయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాబు చేస్తున్న అన్యాయాలను తాను నిలదీస్తున్నాననే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  నా నియోజకవర్గ ప్రజల కోసం పోరాడేందుకు ఎవరినైనా ఎదురిస్తానని అన్నారు. నందికొట్కూరులో రాజకీయంగా తనకు అనుకూల పరిస్థితులు లేకుండా చేయాలని బాబు చూస్తున్నారని ఐజయ్య మండిపడ్డారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల కార్యక్రమానికి ఆహ్వానించకపోయినా నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పేందుకు తాను వెళ్లాలనని ఐజయ్య అన్నారు. తాను వెళ్లకపోతే ఎమ్మెల్యే రాలేదని చెప్పేవారని, వెళితే మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. 

ముచ్చుమర్రి వైయస్ఆర్ పుణ్యమేనని ఐజయ్య అన్నారు.  ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 80 శాతం పనులు వైయస్ఆర్ చేశారన్నారు. మిగిలిన కొద్ది పాటి పనులు కోసం ప్రభుత్వం మూడున్నరేళ్లుగా నాన్చడమంటని నిలదీశారు.  బాబు వచ్చిన ప్రతి సారి సుమారు కోటి రూపాయలు ఖర్చు అవుతోందని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే తప్ప నీరు అందించాలన్న చిత్తశుద్ధి ఏమాత్రం లేదన్నారు.   సిద్ధేశ్వరం దగ్గర ఓ అలుగు కట్టిస్తే 50 టీఎంసీల నీళ్లు తాగు, సాగునీరు చేసుకోవచ్చంటే బాబు పట్టించుకోవడం లేదన్నారు. గుండ్రేవుల ప్రాజెక్ట్ ను నిర్లక్ష్యం చేశారు. ముచ్చుమర్రిలో రెండు పంపులే ఓపెన్ చేశారు. ఇంతవరకు కాంట్రాక్టర్లు ఏం చేశారు. మిగతా రెండు పంపులు ఎందుకు పూర్తి చేయలేకపోయారు. నాలుగు పంపులు పూర్తి చేస్తే 10 టీఎంసీల నీళ్లు నందికొట్కూరు వచ్చేవని అడుగుదామంటే అవకాశం ఇవ్వడంలేదు. నిర్వాసితులున్నారు .కొంతమందికైనా ఉద్యోగ అవకాశం కల్పించాలంటే పట్టించుకోవడం లేదు. 

నిపుణులు, మేధావులు చెప్పినా వినకుండా రాజధాని కడతానని చెప్పి సింగపూర్, జపాన్, చైనా అంటూ బాబు రైతుల దగ్గర 33వేల ఎకరాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని ఐజయ్య విమర్శించారు. పదివేల కోట్లతో వైయస్సార్ ఆనాడే పోలవరాన్ని ప్రారంభించారు. అప్పుడే 5వేల కోట్లు పెట్టారు. బాబు వచ్చాక 25వేల నుంచి 45వేల కోట్లకు, ఆ తర్వాత 60కోట్లకు పై అంచనా వ్యయం పెంచేశారు. రూ. 300కోట్లతో చేయాల్సిన పట్టిసీమకు రూ. 1600కోట్లకు పెంచాడు. మూడున్నరేళ్లయినా ముచ్చుమర్రికి 4 పంపులు పెట్టలేకపోయాడు. మళ్లీ 2వేల కోట్లతో పురుషోత్తం పట్నమట. 2018లో పోలవరం పూర్తి చేస్తామమన్నప్పుడు పట్టిసీమ, పురుషోత్తం పట్నంలు దేనికి బాబు..?  కోస్తానే తప్ప చంద్రబాబుకు సీమ కష్టాలు పట్టడం లేదు. రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నాడని ఐజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top