సైకిళ్లు పంపిణీ

నందికొట్కూరు: బాలికలు పీవీ సింధూను ఆదర్శం తీసుకోవాలని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లో 9వ, తరగతి చుదువుతున్న 111 మంది విద్యార్థినీలకు ఎమ్మెల్యే ఐజయ్య సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో గెలుపోటములను సమానంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. విద్యతో పాటు యోగ, క్రీడల్లో రాణించాలని చెప్పారు. కార్పోరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల్లో విద్యనందించాలన్నారు. బీఈడీ, టీటీసీ ట్రైనింగ్‌ పొంది ఎంతో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాల్లో ఉన్నారని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని సూచించారు. ప్రభుత్వం పాఠశాలలను దెబ్బ కొట్టేందుకు మంత్రులు నారాయణ, గంట పన్నిన కుట్రలో భాగంగానే 10వ, తరగతి పేపర్‌ లీకేజీ అయ్యిందని ఆరోపించారు. అంతకమునుపు ఎమ్మెల్యేను, జడ్పీటీసీ, ఎంపీపీ, చైర్‌ఫర్సన్, విద్య కమిటి చైర్‌ఫర్సన్‌లను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చింతకుంట లక్ష్మి, పురపాలక సంఘం చైర్‌ఫర్సన్‌ సుబ్బమ్మ, ఎంపీపీ వీరం ప్రసాదరెడ్డి, పాఠశాల విద్య కమిటి చైర్‌ఫర్సన్‌ లక్ష్మిదేవి, హెచ్‌ఎం కాంతారాజాకుమారి, ఉపాధ్యాయులు, యాంకర్‌ తెలుగు టీచర్‌ ఆదిశేషమ్మ, పీఈటీలు రాజేశ్వరి, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top