వైయస్సార్‌సీపీ నాయకుడిని పరామర్శించిన వైవీఆర్‌

గుత్తిరూరల్‌: మండలంలోని నేమతాబాదు గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకుడు గోపాల్‌రెడ్డిని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి మంగళవారం పరామర్శించారు. గోపాల్‌ రెడ్డి నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న వైవీఆర్‌ ఇంటికి వెళ్లి గోపాల్‌రెడ్డితో మాట్లాడారు. మెరుగైన చికిత్స చేయించుకొని త్వరగా కోలుకోవాలని సూచించారు. భార్య, పిల్లలకు ఐవైవీఆర్‌ ధైర్యం చెప్పారు. మెరుగైన చికిత్స చేయించాలని వారికి సూచించారు. త్వరలోనే కోలుకోవాలని వైవీఆర్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వినర్‌ గోవర్ధన్‌రెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మల్లయ్యయాదవ్, సీనియర్‌ నాయకుడు రామరంగారెడ్డి పాల్గొన్నారు. 

Back to Top