అవి ప్రజల గుండెలకు చేసిన గాయాలే !

కడపజిల్లాలో
ఉక్కు కర్మాగారం కావాలని డిమాండ్ చేస్తూ 
ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష
నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.విద్యార్ధులపై
కర్కశంగా పోలీసు బలగాన్ని ప్రయోగించారని,  విద్యార్ధుల వంటిపై పడిన ప్రతి ఒక్క దెబ్బ
రాష్ట్ర ప్రజల గుండెల మీద ముఖ్యమంత్రి చేస్తున్న గాయమే అని అన్నారు. ఈ అంశంపై  ఆయన ట్విటర్ ద్వారా స్పందించారు. విద్యార్ధి
నాయకుడు నాయక్ పరిస్థితి తనకు ఆందోళన కలిగిస్తోందని, ఆయనకు వెంటనే మంచి చేయించాలని
ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.  ట్వీట్ లో
చంద్రబాబును ఉద్దేశిస్తూ, నాలుగేళ్లుగా కేంద్ర మంత్రివర్గంలో ఉన్న మీరు, మీ కేసుల
కోసం, లంచాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేయటం వల్లనే నేడు విద్యార్ధులు,
విపక్షాలు రోడ్డెక్కాల్సి వస్తోందని అన్నారు.

గతంలో విద్యుత్తు ఛార్జీలు తగ్గించండన్నందుకు
బషీర్ బాగ్ లో ప్రజల గుండెల మీద కాల్పించారని, ఇప్పుడు గ్రామగ్రామాన , ప్రతి
జిల్లాలో మీరు, మీ పార్టనర్లూ చేసిన వందల వంచనల మీద ప్రజలు గర్హిస్తున్నారన్నారు.
చేతలతో సమాధానం ఇవ్వలేకనే మీరు వారందరికీ లాఠీలతో, తుపాకులతో సమాధానం ఇస్తారా? బాబు
గారు ఇది దుర్మార్గమని వైయస్ జగన్ పేర్కొన్నారు.

Back to Top