మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం

తూర్పుగోదావరి(అమలాపురం): తెలుగుదేశం సర్కార్  నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తోందని వైయస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్‌ ఫైర్ అయ్యారు. 
మీడియాపై అంక్షలు విధించి గొంతు నొక్కే ప్రయత్నం  దుర్మార్గమన్నారు.  వైయస్‌ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు కొనుకు బాపూజీ అధ్యక్షతన సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేతను నిరసిస్తూ అల్లవరం తహసీల్దారు కార్యలయం వద్ద వైయస్‌ఆర్‌సీపీ శ్రేణలు నిరసన తెలిపారు. మీడియా స్వేచ్ఛను కాపాడండి– ప్రజాస్యామ్యాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్‌ మాట్లాడుతూ అధికార పార్టీ తీరు హేయమైనదని అన్నారు. 

పలువురు మాట్లాడుతూ మీడియాపై అంక్షలు ఎత్తివేయాలని, తక్షణమే సాక్షి ప్రసారాలు పునర్ధరించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారు గౌరినాయుడుకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యిళ్ల శేషారావు, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మోకా రాఘవులు, బీసీ సెల్‌ అధ్యక్షుడు యల్లమిల్లి బోస్, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కలగట ఏసుబాబు, యూత్‌ అధ్యక్షుడు దాసం శ్రీరామచంద్రమూర్తి, రైతు విభాగ అధ్యక్షుడు బొక్కా శ్రీను, మండల కార్యదర్శి వాసంశెట్టి నరసింహరావు, సీనియర్‌ నాయకులు జున్నూరి బాబి, మెరికల శ్రీను, పల్లి జేమ్స్‌రాజు, తాళ్ల సాంభమూర్తి, గుబ్బల బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
Back to Top