టీడీపీ నేత‌ల‌కు దోచిపెడ‌తారా

హైద‌రాబాద్‌) ప్ర‌త్యేక అభివృద్ధి నిధి (ఎస్ డీ ఎఫ్‌) అనే పేరుతో ప్ర‌భుత్వ నిధుల్ని టీడీపీ నేత‌ల‌కు దోచిపెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బ‌ని ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ నిల‌దీశారు. శాస‌న‌స‌భ‌లో ఎస్ డీ ఎఫ్ నిధుల వినియోగం మీద ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌క్రిష్ణుడు మాట్లాడారు. దీనికి ప్ర‌త్యేకంగా మార్గ‌ద‌ర్శ‌కాలు అంటూ లేవ‌ని, ముఖ్య‌మంత్రి ఇష్టం మీద ఇస్తార‌ని చెప్పారు. త‌ర్వాత ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మాట్లాడారు. వాకౌట్ చేస్తామ‌ని, దీని గురించి ప్ర‌స్తావ‌న చేస్తున్నామ‌ని చెప్పారు. 
నియోజ‌క వ‌ర్గాల్ని అభివృద్ధి చేయ‌టానికి ఎమ్మెల్యేల‌కు నిధులు ఇవ్వ‌టం సాంప్ర‌దాయం అని వైఎస్ జ‌గ‌న్ చెప్పారు. దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యంలో ఎమ్మెల్యేల‌కు గ‌ణ‌నీయంగా నిధులు ఇచ్చార‌ని చెప్పారు. దీనికి టీడీపీ స‌భ్యులు అడ్డు చెప్ప‌టంతో వైఎస్ జ‌గ‌న్ అభ్యంత‌రం తెలిపారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడ‌వ‌ద్ద‌ని, చంద్ర‌బాబు బాట‌లోనే మీరంతా న‌డుస్తున్నార‌ని  వైఎస్ జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. 
పార్ల‌మెంటులో స‌భ్యులు అంద‌రికీ 5 కోట్ల రూపాయిలు ఇస్తున్నార‌ని, అందులో పార్టీల‌కు అతీతంగా ప్ర‌తీ ఒక్క‌రికి నిధులు ఇస్తార‌ని చెప్పారు. ఎందుకంటే రెండు ల‌క్ష‌ల మంది ఎన్నుకొని గెలిపించారు కాబ‌ట్టి ఆయా నాయ‌కుల అభిప్రాయాల‌కు అనుగుణంగా నియోజ‌క వ‌ర్గాలు అభివృద్ధి చెందాల‌న్న‌ది ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. అయితే ఇక్క‌డ మాత్రం టీడీపీ నాయ‌కులు ఓడిపోయిన నియోజ‌క వ‌ర్గాల్లో ప‌రిస్థితి మ‌రో ర‌కంగా ఉంద‌ని చెప్పారు. ఓట‌మి పాలైన టీడీపీ నేత‌ల‌కు, మాజీ టీడీపీనాయ‌కుల‌కు నిధులు ఇస్తున్నార‌ని చెప్పారు కందుల నారాయ‌ణ రెడ్డి, ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి వంటి వార్ల‌కు ఏ ర‌కంగా నిధులు ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. 
ఈ స‌మ‌యంలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు మైక్ క‌ట్ చేశారు. టీడీపీ నేత‌ల పేర్లు చ‌ద‌వ‌టానికి ఆయ‌న ఇష్ట ప‌డ‌లేదు.  మైక్ ను టీడీపీ స‌భ్యుడు శ్ర‌వ‌ణ్ కుమార్ కు ఇచ్చారు. త‌ర్వాత మైక్ ఇచ్చిన‌ట్లే ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ కు మైక్ ఇచ్చి క‌ట్ చేశారు. దీనికి వైఎస్సార్సీపీ స‌భ్యులు నిర‌స‌న తెలిపారు.  
Back to Top