మహా ఒప్పందం కాదు మహామోసం

మహారాష్ర్ట ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మహా ఒప్పందంగా అభివర్ణించడం సిగ్గు చేటని టీ వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ వ్యాఖ్యానించారు. అది మహా ఒప్పందం కాదు, మహా మోసమని విమర్శించారు. ఈ ఒప్పందంపై సర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల పరువు, ఆత్మగౌరవాన్ని మహారాష్ట్రలో తాకట్టు పెట్టి, కమిషన్ల కోసమే కేసీఆర్ ఎత్తు తగ్గించారని ఆరోపించారు.

తమ్మిడిహెట్టి వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడం, మేడి గడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తు 102 మీటర్ల నుంచి వంద మీటర్లకు తగ్గించడం చరిత్రాత్మకమైనది కాదని, చారిత్రాత్మక తప్పిదమని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
Back to Top