సుధాకర్ ది ప్రభుత్వ హత్యే-ఎమ్మెల్యే రోజా

తిరుపతి: ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు అర్పించిన
మదనపల్లి వాసి సుదాకర్ ది ప్రభుత్వ హత్యే అని వైయస్ ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం
అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా అన్నారు.  ప్రత్యేక హోదా కోసం ఇంకా ఎంత
మంది ప్రాణాలు తీసుకోవాలని  ఆమె మండిపడ్డారు. 
దాదాపు మూడేళ్ల క్రితం  ఇదే
జిల్లాకు చెందిన మునికోటి హోదా కోసం ప్రాణాలు అర్పిస్తే ఆ కుటుంబాన్ని ఇప్పటి వరకు
ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శించారు.  ఈ
నేపథ్యంలో శనివారం ఉదయం మదనపల్లిలో చేనేత కార్మికుడు సుధాకర్ బలవన్మరణానికి
పాల్పడిన ఉదంతంపై ఆమె స్పందిస్తూ, ఇది సుధాకర్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత
వహించాలన్నారు.

తిరుపతి వెంకన్న సాక్షిగా బాబు మోడీ జోడీ ఇచ్చిన హామీలు
ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఉద్యమాలు చేస్తున్న వారిపై  తప్పుడు కేసులు బనాయిస్తూ,మరోపక్క టిడిపి
ఎంపిలు పార్లమెంటులో  డ్రామాలు చేస్తున్నారు
తప్పితే , కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని మండిపడ్డారు. 

Back to Top