పారిపోయిన పిరికిపంద ప్రభుత్వం

అధికారపక్షం చర్చకు రాకుండా పారిపోయింది
సభ నుంచి తప్పించుకున్నా..
ప్రజల నుంచి తప్పించుకోలేరు
బాబు బాక్సైట్ కోసం తనను టార్గెట్ చేశారుః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ః ద్రవ్య వినిమియ బిల్లును వ్యతిరేకిస్తూ డివిజన్ ను కోరితే ప్రభుత్వం అసెంబ్లీ నుంచి పారిపోయిందని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పిరికిపంద ప్రభుత్వమని దుయ్యబట్టారు. ఇవాళ అసెంబ్లీ నుంచి తప్పించుకున్నా ప్రజల నుంచి తప్పించుకోలేరని అధికార టీడీపీని హెచ్చరించారు. ప్రలోభాలతో కొనుక్కున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమే... ప్రభుత్వం అక్రమంగా తప్పంచుకుందని అన్నారు.

 చట్టసభలకు వీరు ఏవిధమైన మెసేజ్ ఇస్తున్నారో  ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రూల్స్ ప్రకారం పోదామంటే మేమే సుప్రీం అంటారు. రూల్స్ ను డిలేట్ చేస్తున్నారు. మెజారిటీ ఉందని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.  రాక్షస పాలన సాగిస్తున్నారని టీడీపీపై నిప్పులు చెరిగారు. బిల్లుపై చర్చకు ఆస్కారముందంటే హేళనగా మాట్లాడుతున్నారు. స్పీకర్ తనకు తాను స్టేట్ మెంట్ ఇచ్చుకొని, వాళ్లకు అనుకూలంగా సభ నడుపుకొని వాయిదా వేసుకొని పోయారని నిప్పులు చెరిగారు. 

బాక్సైట్ కోసం బాబు టార్గెట్
సభ  ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుందా..లేక నియంత పాలనతో నడుస్తుందో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.. పాడేరు సంగతి చూస్తానంటూ చంద్రబాబు తనను బెదిరిస్తున్నారని ఈశ్వరి అన్నారు.  చట్టసభల్లో అధికార టీడీపీ తమ గొంతు నొక్కిందని, మైక్ ఇవ్వాలంటూ  తాము నిలదీస్తే  వ్యక్తిగత కక్షసాధింపులకు పాల్పడుతున్నారన్నారు. మహిళలన్నా , గిరిజనులన్నా వివక్ష ఉందని బాబు చెప్పకనే చెప్పారన్నారు. 

గిరిజనులు గొంతు విప్పకూడదా బాబు...? బయపెడుతున్నారా..? మాట్లాడితే 35 ఏళ్ల అనుభవం ఉందని మాట్లాడే ముఖ్యమంత్రి.... స్థాయిని తగ్గించుకొని మాట్లాడాల్సిందిపోయి గిరిజన మహిళలను కించపర్చేలా మాట్లాడుతున్నారు. బాబు తీరును ప్రజలంతా  గమనిస్తున్నారని ఈశ్వరి పేర్కొన్నారు. ఖనిజ సంపద బాక్సైట్ కోసం చంద్రబాబు తనను టార్గెట్ చేశారని గిడ్డి ఈశ్వరి వాపోయారు. దీనిలో భాగంగానే మా గొంతు నొక్కేందుకు కించపర్చేవిధంగామాట్లాడుతున్నారన్నారు. బాబు దూషణలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.  

Back to Top