ల‌క్షా 34వేల కోట్ల అవినీతి ఇది..!

() అవినీతి, అబ‌ద్దాలే చంద్ర‌బాబు పాల‌న‌
() మ‌హానాడు అంతా బోగ‌స్‌
() వైయ‌స్సార్సీపీ అధికార ప్ర‌తినిధి చెల్లుబోయిన వేణు

హైద‌రాబాద్‌) రాష్ట్రంలో ఒక‌లక్ష‌ 34వేల కోట్ల అవినీతి జ‌రిగింద‌ని, దీని మీద  విచార‌ణ‌కు లోకేష్ సిద్ద‌మేనా అని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి వేణుగోపాల‌కృష్ణ సూటిగా ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో డ్వాక్రా, రైతుల రుణామాఫీ జ‌రిగిందంటూ లోకేష్ సైతం త‌న తండ్రిబాట‌లో న‌డుస్తూ అబద్దాల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నార‌న్నారు. భ‌గ‌వంతుడి స‌న్నిధిలో లోకేష్ అబద్దాలు చెబుతూ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క మ‌హిళ చేత‌గానీ, రైతు చేత‌గానీ పూర్తిస్థాయిలో రుణామాఫీ జ‌రిగింద‌ని చెప్పించ‌గ‌ల‌రా అని ఆయ‌న లోకేష్‌కు స‌వాల్ విసిరారు.
 
ఇసుక పేరుతో త‌మ్ముళ్ల దోపిడి...!
ఉచిత ఇసుక పేరుతో తెలుగు త‌మ్ముళ్లు కోట్ల రూపాయ‌ల‌ను గ‌డిస్తున్నార‌ని ఆరోపించారు. ఇసుక అంద‌క పేద‌వారు ఇళ్ల‌ను నిర్మించుకోలేక‌పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల‌కు ప‌నికొచ్చే విష‌యాల‌ను మ‌హానాడులో ఒక్క‌టైనా ప్ర‌వేశ పెట్టారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో దొంగ‌లంటే టీడీపీ నేత‌లే అని ప్ర‌జ‌లు మాట్లాడుకుంటున్నార‌ని వివ‌రించారు. బాబు త‌న రెండేళ్ల పాల‌న‌లో చేసింది ఏమీ లేద‌న్నారు. అందువ‌ల్లే మ‌హానాడులో వైయ‌స్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తూ టైంపాస్ చేస్తున్నార‌ని ఆరోపించారు. ప్ర‌జ‌ల మెప్పు పొంద‌లేక‌నే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. 

ఓటుకు నోటు కేసు భ‌యంతోనే...!
కేవ‌లం ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఆంధ్ర‌రాష్ట్ర గౌర‌వాన్ని కేసీఆర్‌కు తాక‌ట్టు పెట్టార‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం అక్ర‌మంగా చేప‌డుతున్న ప్రాజెక్టుల‌ను ఆప‌కుండా నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హారిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఒక‌వైపు తెలంగాణ ప్ర‌భుత్వం నీళ్ల‌ను తోడేస్తుంటే బాబు విదేశాలు చుట్టి వ‌స్తున్నార‌ని ఎద్దేవా చేశారు.  పోల‌వ‌రం నిర్మాణం రాష్ట్రానికి సంజీవ‌ని లాంటిద‌ని గోపాల‌కృష్ణ అభిప్రాయ‌ప‌డ్డారు. అలాంటి ప్రాజెక్టును గాలికి వ‌దిలేసిన ఘ‌న‌త బాబుద‌న్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో పోల‌వ‌రం నిర్మాణ బాధ్య‌త పూర్తిగా కేంద్ర ప్ర‌భుత్వానిదే అని ఉన్న త‌న అవినీతి, అక్ర‌మాలు ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డ‌తాయో అన్న భ‌యంతోనే పోల‌వ‌రం ప్రాజెక్టుపై కేంద్రంతో గ‌ట్టిగా మాట్లాడ‌లేక‌పోతున్నార‌ని విమ‌ర్శించారు. ప‌ట్టిసీమ‌ను ముందుకు తెచ్చి న‌దుల అనుసంధానం అంటూ కాలం వెళ్ల‌దీస్తున్నార‌ని నిప్పులు చెరిగారు.  ప్ర‌త్యేక హోదాపై కేంద్రాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌న్నారు. 

తాజా వీడియోలు

Back to Top