<br/>హైదరాబాద్) ఓటుకు కోట్లు కేసులో వాస్తవాలు క్రమంగా నిర్ధారణ అవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలను మరింత నిర్ధారణ కోసం ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన విషయం తెలిసిందే. రెండు సెల్‌ఫోన్లు, కెమెరాలు, రేవంత్‌రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న సీపీయూలను ల్యాబ్‌కు పంపారు. అలాగే మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను కూడా టేపులను కూడా ల్యాబ్ పంపారు. ఆడియోలో ఉన్నది తన గొంతు కాదంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న వాదనల నేపథ్యంలో ఆధారాలను ల్యాబ్‌కు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ 14 ఆడియోలో, వీడియో టేపుల్లో ఉన్న వాస్తవ అంశాలను ల్యాబ్ శాస్త్రీయ రీతిలో నిర్ధారణ చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏ టేపు లో ఎంతెంత నిడివిలో ఆడియో, వీడియో లు ఉన్నవి ల్యాబ్ లో నిర్ధారణ అయింది. గొంతు కు సంబంధించి కూడా శాస్త్రీయ పద్దతిలో విశ్లేషణ ను క్రోడీకరిస్తున్నారు. ఈ నివేదిక ల ఆధారంగా తదుపరి చర్యలకు ఏసీబీ సన్నాహాలు చేస్తోంది. దర్యాప్తు సంస్థ వేస్తున్న అడుగుల్ని బట్టి పాత్రధారి రేవంత్ రెడ్డి, సూత్రధారి చంద్రబాబు మెడకు గట్టిగా ఉచ్చు బిగుస్తున్నట్లు అర్థం అవుతోంది.