హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు మరోమారు అవకాశం

వైజాగ్ః మార్చి 12 / 13 వ తేదీన జ‌రిగిన ముఖాముఖి కార్యక్ర‌మానికి హాజ‌రు కాలేక‌పోయిన‌ యువ‌జ‌న / మ‌హిళా /  రైతు / విద్యార్ధి విభాగాల మండ‌ల స్థాయి అభ్య‌ర్ధులకు అవకాశమిస్తూ మార్చి 26వ తేదీన  మరోమారు ముఖాముఖి కార్య‌క్ర‌మాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం 9 గం.లకు నిర్వ‌హించ‌నున్నారు. పార్టీ అధ్య‌క్షులు వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు బి.సి. మ‌రియు య‌స్‌.సి. విభాగాల‌ను కూడా అన్ని స్థాయిల‌లో ప‌టిష్ట‌ప‌రిచే క్ర‌మంలో.... ప్ర‌తి మండ‌లం నుండి ముగ్గురి నాయ‌కుల పేర్ల ప్ర‌తిపాద‌నలను  ఈనెల 24వ తేదీలోగా కేంద్ర కార్యాల‌యానికి పంప‌టంతో పాటు,  26న బి.సి. మ‌రియు య‌స్‌.సి. విభాగాల అభ్య‌ర్ధులకు కూడా ఆయా విభాగాల రాష్ట్ర మ‌రియు జిల్లా అధ్య‌క్షుల స‌మ‌క్షంలో ముఖాముఖి కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.

కావున‌, మార్చి 24వ తేదీలోగా మీ నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని మండ‌లాలు/  మున్సిపాలిటీలు / కార్పొరేష‌న్ డివిజ‌న్ల నుండి బి.సి. మ‌రియు య‌స్‌.సి. విభాగాల‌కు నిబ‌ద్దద్ధత క‌లిగిన ముగ్గురు నాయ‌కుల పేర్ల‌ను పార్టీ కేంద్ర కార్యాల‌య ఈ-మెయిల్ ఐ.డి.కి పంప‌టంతో పాటుగా ఇదివ‌ర‌లో జ‌రిగిన ముఖాముఖి కార్యక్ర‌మానికి హాజ‌రు కాలేక‌పోయిన వారిని మ‌రియు  బి.సి. మ‌రియు య‌స్‌.సి. విభాగాల అభ్య‌ర్ధుల‌ను మార్చి 26వ తేదీన జ‌ర‌గ‌నున్న ముఖాముఖి కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేలా చూడ‌వ‌ల‌సిందిగా వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. .
Back to Top