ఎన్ ఆర్ ఐ లతో ముఖాముఖి

ప్రతిపక్షనేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ రేపు ఆదివారం నాడు ఎన్ ఆర్ ఐ లతో ముఖాముఖి మాట్లాడనున్నారు.  లైవ్ లింక్ https://goo.gl/a4D8HJ ద్వారా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు.

విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ఊరట కలగాలంటే ప్రత్యేక హోదాను ఇప్పించాలని కొంత కాలంగా వైయస్సార్సీపీ పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేయటమే గాకుండా దీక్షలు, ఉద్యమాలు, ఆందోళనలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో యువత, విద్యార్థులకు దీనిపై అవగాహన కల్పించేందుకు అనేక నగరాల్లో యువభేరి నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రవాసాంధ్రులకు అవగాహన కల్పించేందుకు ఎన్ ఆర్ ఐ లతో ముఖాముఖి మాట్లాడాలని నిర్ణయించారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8.30 ని.లకు ఆయన నేరుగా డిజిటల్ మీడియా ద్వారా అందుబాటులోకి వస్తున్నారు. ఆ సమయంలో వైయస్ జగన్ తో ముఖాముఖి మాట్లాడవచ్చు.  లైవ్ లింక్ https://goo.gl/a4D8HJ ద్వారా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు.
Back to Top