ప్ర‌తిప‌క్ష నేత పాద‌యాత్ర‌లో ఇంటెలిజెన్స్ పోలీసులు


క‌ర్నూలు:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌పై ప్ర‌భుత్వం ఆరా తీస్తోంది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా జర్నలిస్టులతో బేతంచెర్ల సమీపంలో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఇంటెలిజెన్స్‌ పోలీసు నాగేంద్ర.. ఈ కార్యక్రమానికి హాజరై ప్రతి విషయాన్నీ నమోదు చేసుకున్నారు. ఆ వివరాలను పాదయాత్ర నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ విభాగం ఏర్పాటు చేసుకున్న వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని గమనించిన జర్నలిస్టులు సదరు పోలీసును ప్రశ్నించడంతో అక్కడి నుంచి జారుకున్నారు. 
Back to Top