చంద్రన్న బీమా ప్రచార ఆర్భాటమే

  • గొర్రెల కాపరుల కుటుంబాలను పరామర్శించిన వైయస్‌ జగన్‌
  • మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించకపోవడం బాధాకరం
  • బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం
  • వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
వైయస్‌ఆర్‌ జిల్లా: చంద్రన్న బీమా పథకం ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఇటీవల వైయస్‌ఆర్‌ జిల్లా తొందుర్రులో ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన ముగ్గురు గొర్రెల కాపరుల కుటుంబాలను వైయస్‌ జగన్‌ పరామర్శించారు.  అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ...తెల్లవారు జామున ఆర్టీసీ బస్సు యథేశ్చగా వచ్చి గొర్రెల మందను ఢీకొట్టడంతో దాదాపు 150 గొర్రెలు, ముగ్గురు కాపరులు మృత్యువాత పడ్డారని చెప్పారు. ప్రభుత్వ బస్సు ప్రమాదానికి కారణమైనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించకుండా బాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. పైగా బాధిత కుటుంబాలపై ప్రభుత్వ ఉన్నతాధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదానికి ప్రైవేట్‌ వ్యక్తి కారణం అయితే మానవత్వంతో చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేవాడని, కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

 150పైగా గొర్రెలు చనిపోయి దాదాపు 10 లక్షలు నష్టపోతే మేం గొర్రెలకు నష్టపరిహారం ఇవ్వం, తెల్లవారుజామున మీకేం పని రోడ్డుమీద అని ఆర్టీసీ నిర్వాహకులు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే బాధిత కుటుంబాలు ఎవరిని ఆశ్రయించాలని వైయస్‌ జగన్‌ చంద్రబాబును ప్రశ్నించారు. బాధిత కుటుంబాలు కోర్టుకు వెళ్లమని సంతకం పెడితే రూ. 3 లక్షలు ఇస్తామని, గొర్రెలకు మాత్రం నష్టపరిహారం చెల్లించమని ప్రభుత్వ పెద్దలు చెప్పడం సమంజసమేనా అని ప్రశ్నించారు. రూ.  ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
 
Back to Top