స్పీకర్ ను అడ్డు పెట్టుకొని ప్రజాసమస్యలను ..తుంగలో తొక్కుతున్న టీడీపీ సర్కార్రాజధాని తంతంగంపై ఆర్కే ప్రశ్నలుటైం లేదంటూ సమాధానం దాటవేసిన స్పీకర్
అసెంబ్లీః స్పీకర్ ను అడ్డు పెట్టుకొని ప్రజాసమస్యలను ఏవిధగా తుంగలో తొక్కేయాలో ...ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిచిన తీరే ఉదాహరణ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ల్యాండ్ పులింగ్ లో స్థలాలు ఇవ్వని రైతుల పట్ల రానున్న రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న వైఖరి ఏంటని తాను ప్రశ్నిస్తే ..మంత్రి నారాయణ స్పీకర్ దగ్గరికి వెళ్లి మాట్లాడడం, వెంటనే స్పీకర్ టైంలేదని తన ప్రశ్నకు సమాధానం రాకుండా తొక్కేయడం దారుణమన్నారు.
రాజధాని ప్రాంతంలో మంగళగిరి శాసనసభ్యుడిగా ఉన్న తాను ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగిందని ఆర్కే చెప్పారు. ల్యాండ్ పూలింగ్ కింద ఎంత భూమి ఇచ్చారు. ఎంతమంది ఇచ్చారు. వారిని ఏమైనా ఇబ్బందులు పెట్టారా లేక కేసులు పెట్టారా అని తాను ప్రశ్నించానని ఆర్కే స్పష్టం చేశారు. కానీ వేటికీ సమాధానం ఇవ్వకుండా తన ప్రశ్న వస్తున్న తరుణంలో టైం లేదని తప్పించుకున్నారన్నారు.
2014 డిసెంబర్ చివర్లో ల్యాండ్‌పూలింగ్ కు సహకరించని...11 గ్రామాలకు చెందిన రైతన్నల షెడ్లు, ఎరువులు, పంటలను తగలబెట్టారని, దీంతో రైతన్నలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారని ఆర్కే చెప్పారు. ప్రభుత్వమే ఈ పని చేయించకపోతే దోషులను ఎందుకు పట్టుకోలేదని నిలదీశారు. ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకించిన గ్రామాలను, రైతులను టార్గెట్ చేసి ప్రభుత్వం వారిపై కక్ష్యసాధింపుకు పాల్పడిందని, వారి పంట పొలాలను తగలబెట్టి దారుణంగా ప్రవర్తించిందని ఆర్కే ఫైరయ్యారు.
ల్యాండ్‌పూలింగ్‌కు ఒప్పుకోకపోవడంతో అధికారపార్టీ నేతలు తన ఐదెకరాల చెరుకు పంటను దగ్దం చేశారని..మల్కాపురం గ్రామానికి చెందిన రైతు గద్దె చంద్రశేఖర్ రావే స్వయంగా విలేకరులకు తెలిపాడన్నారు. మూడు పర్యాయలు తమ నాన్న శాసనసభ్యుడిగా ఉన్నారని, టీడీపీ ఆవిర్భావంలో ఉన్నటు వంటి వ్యక్తి అని చెప్పినా పంటను తగలబెట్టారని పత్రికముఖంగా చెప్పారన్నారు. అంతేకాకుండా గుండపు రాజేష్, గుండపు చంద్రశేఖర్‌ల పోలాలు జేసీబీలతో రూ. 25లక్షల ఖరీదు చేసే ఏడెకరాల అరటితోటను దున్నేశారని వివరించారు.
ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రైతులపై కక్షగట్టి....మాస్టర్‌ప్లాన్ పేరుతో ప్రభుత్వం వారి భూములను బలవంతంగా లాక్కుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు పొలాలు ఇవ్వమని చెబుతున్న రైతులను తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. వీటన్నంటిపై అసెంబ్లీలో ప్రశ్నలు సంధిస్తే ...ప్రభుత్వం వాటిని దాటవేసే పరిస్థితిలో ఉండడం దుర్మార్గమన్నారు. రైతుల పక్షాన వైఎస్ జగన్ నాయకత్వంలో న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేస్తామని ఆర్కే తేల్చిచెప్పారు.