వచ్చే సోమవారానికి విచారణ వాయిదా

హైదరాబాద్ః ఓటుకు నోటు కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.  ఇవాళ చంద్రబాబు నాయుడు తరఫున సిద్ధార్థ లుథ్రా కోర్టులో వాదనలు వినిపించారు. వచ్చే సోమవారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరపాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఏసీబీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

దీంతో తనపై విచారణ నిలిపివేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ఎనిమిది వారాల పాటు స్టే విధించింది. బాబు స్వర నమూనాలను వివిధ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లలో పరీక్షలకు పంపి, ఆ నివేదికల ఆధారంగా ఆర్కే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.
 
Back to Top