కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం

అంబాజీపేట : కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వైయస్‌ఆర్‌‡ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కో –ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు అన్నారు. అంబాజీపేటలో గురువారం ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి నిధులు, విశాఖ రైల్వే జోన్‌ అంశాలు బడ్జెట్‌లో లేకపోవడం బాధాకరమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హాయాంలో ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్‌ల మాదిరిగానే నాలుగో బడ్జెట్‌ కూడా పేలవంగా ఉందని విమర్శించారు. బడ్జెట్‌లో కనీసం ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ ప్రస్తావన లేకపోవడం దారుణం. రైతులకు కేపిటల్‌ గెయిన్‌ మినహాయింపు ఇస్తే రైతులకు లాభం ఉండేది. గృహ నిర్హాన రుణాల విషయంలోను సామాన్యులకు నిరాశ మిగిల్చారు. నోట్ల రద్దుతో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం దానిపై పెదవి విప్పకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

Back to Top