బాబు పాలనలో రైతులకు తీరని అన్యాయం

రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు
హామీలు విస్మరించి బాబు విదేశాల్లో షికార్లు చేస్తున్నాడు
రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం
అందరం కలిసికట్టుగా పోరాడుదాంః వైయస్ జగన్

పశ్చిమగోదావరి జిల్లా(జంగారెడ్డి గూడెం): చంద్రబాబు పాలనలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో రైతుల బాధలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రుణాలు మాఫీ కాక, పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే...చంద్రబాబు విమానాల్లో విదేశాలు తిరుగుతూ షికార్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతుల ధర్నాకు వైయస్ జగన్ మద్దతు తెలిపారు.  రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వైయస్ జగన్ ఏమన్నారంటే...

  • పొగాకు రైతులు అతి దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు.
  • ఏ పంటకు కనీస మద్దతు ధర రావడం లేదు.
  • వరి దగ్గర్నుంచి పామాయిల్ ,  పామాయిల్ నుంచి పొగాకు రైతుల దాకా పరిస్థితి దారుణంగా ఉంది.
  • పంటలకు మద్దతు ధర దొరకడం లేదని కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే కోసం మీటింగ్ లు పెట్టి ధర్నా చేస్తుంటే హోంమంత్రి వార్నింగ్ ఇస్తున్నాడు. 
  • రైతుల బాధలు పట్టించుకునే నాథుడే లేడు
  • బాబూ.. ఎన్నికలప్పుడు ఏం చెప్పావు...? ఇప్పుడు చేస్తున్నదేంటి..?
  • రైతులకు కనీస మద్దతు దొరకడం లేదు. జగన్ 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి అన్నాడు, నేను 5 కోట్లతో స్థిరీకరణ నిధి పెడతానని ఎన్నికల్లో నీవు చెప్పలేదా బాబూ..?
  • కనీస మద్దతు ధర వచ్చేలా నేను హామీగా ఉంటానని చెప్పావ్. ఆ హామీలు ఏమయ్యాయి బాబు. 
  • రుణాలన్నీ మాఫీ కావాలన్నా, బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలన్నా బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు.
  • నేను అడుగుతున్నా...ఇవాళ నీవైతే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావ్. మరి రైతుల పరిస్థితి ఏమిటి బాబు.
  • రైతులు ప్రతి సంవత్సరం గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారు. రుణాలు కట్టకపోవడంతో బ్యాంకులకు పోయే పరిస్థితి లేదు. 
  • కొత్త రుణాలు రాక...ఉన్న రుణాలు రెన్యువల్ కాక రూ. 2 అపరాధ వ్డడీలు కట్టే పరిస్థితి నీవు కాదా బాబు తెచ్చింది.
  • పొగాకు రైతులకు రూ. 20 బోనస్ అన్నాడు. ఆయన జిల్లాకు ఇచ్చింది రూ. 70 లక్షలు కూడా దాటలేదు. ముష్టివేసినట్లుగా వేశారు. 
  • పొగాకు రైతులు బతకాలంటే సగటు ధర రూ.160 రావాలి. కానీ బాబు గతేడాది మాదిరే ఈసంవత్సరం కూడా రూ.114 మాత్రమే ఇస్తున్నారు.
  • 75 వేల ఎకరాల్లో పంట సాగవుతుంటే..ప్రొడక్షన్ తగ్గిస్తేనే రేటు వస్తుందని చెప్పడంతో రైతులు పంటలను కూడా తగ్గించుకున్నారు. 
  • 65 మిలియన్ క్వింటాళ్ల నుంచి 35 మిలియన్ క్వింటాళ్లకు తగ్గించారు. 
  • ప్రొడక్షన్ తగ్గింది కాబట్టి రేట్లు పెరుగుతాయేమోనని రైతులు ఆశగా ఎదురుచూశారు.
  • ఉత్పత్తి తగ్గినప్పుడు మద్దతు ధర పెరగాల్సింది పోయి ఇంకా తగ్గించారు. 
  •  25 క్వింటాళ్లకు కుదించారు.  అప్పుడైనా కొన్నారంటే అదీ లేదు. పొగాకు కొనకపోతే రైతులు ఎక్కడకు పోవాలి. వారి పరిస్థితి ఏంటి.
  • వర్షాలు ప్రారంభమయ్యేదాకా ప్రభుత్వంలో, టొబాకో బోర్డులో చలనం లేదు. 
  • కలర్ మారి పొగాకు లోగ్రేడ్ గా మారుతుందని రైతులు భయంగా ఉన్నారు. 
  • 45 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తానని చెప్పి 23 కేజీలు మాత్రమే చేశారు. 
  • రైతుల దగ్గర ఇంకా సగం ఉంది. ఎప్పుడు కొంటారు బాబు. రైతుల తరపున నిలబడాల్సింది పోయి వారికి అన్యాయం చేస్తారా.
  • మిడిల్, లో గ్రేడ్ రేటులు చూస్తే రూ. 80 పలుకుతున్నారు. 
  • రైతులను ఆదుకునేందుకు  కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత మీది కాదా బాబు. 
  • రైతులకు తోడుగా ఉండకపోతే, హోదా ఇవ్వకపోతే కేంద్రంలో మంత్రులను ఉపసంహరించుకుంటానని చెప్పే దమ్మూ, దైర్యం లేకపోయింది.
  • పొగాకు మీద రూ.30 వేల కోట్లు రెవెన్యూ వస్తున్నా రైతులను ఆదుకోవడం లేదు.
  • జిల్లాలో ముగ్గురు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఐనా ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదు. 
  • రైతులు బ్యారెన్ కట్టాలంటే పెట్టుబడి 7,8 లక్షలు అవుతోంది. ఇవాళ పొగాకు కొనకపోతే వారు ఎక్కడకు పోవాలి. 
  • వడ్డీలు ఎవరు కడతారని రైతులు అడుగుతున్నారు. 
  • గతంలో తాను దేవరపల్లి వచ్చినప్పుడు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అప్పుడు కాస్తో కూస్తో రేటు పెరిగింది. 
  • ఈసంవత్సరం కూడా తాను జంగారెడ్డి గూడెం వస్తున్నానని తెలిశాక రేటు పెంచారు. నీను వెళ్లిపోయాక రేటు మళ్లీ తగ్గిస్తారు. 
  • రైతులు ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే వారిని ఆదుకోవాలన్న ఆలోచనే ప్రభుత్వానికి లేకుండా పోయింది.  
  • మహానేత వైయస్సార్ పాలనలో పొగాకు సగటు రూ. 160 పైనే ధర ఉండేది. హై గ్రేడ్ 200 పైన ఉండేది. 
  • కానీ బాబు వచ్చాక రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. 
  • పామాయిల్ ధర మహానేత ఉన్నప్పుడు రూ. 10 వేలు పలికింది. ఇవాళ చూస్తే 5,500 మాత్రమే పలుకుతున్న దుస్థితి. 
  • ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంటే మద్దతు ధర తగ్గించడం దారుణం. 
  • స్థిరీకరణ నిధి తీసుకొచ్చేలా, రైతులను ఆదుకునేలా  చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం గట్టిగా చేద్దాం. కలిసికట్టుగా పోరాడుదాం.
  • ప్రజలు చైతన్యవంతులు కావాలి. అబద్ధాలు చెప్పి మోసం చేస్తే ప్రజలు నిలదీస్తారన్న భయం రాజకీయ నాయకుల్లో పుట్టాలి.
  • రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి.  రాజకీయ నాయకులు ఏమాటైనా చెబితే దానిపై నిలబడేలా ప్రజలు నిలదీస్తేనే రాజకీయ వ్యవస్థ మారుతుంది.
  • చంద్రబాబు ముందు ముందు అబద్ధాలు ఇంకా చెబుతారు. ప్రతి ఒక్కరికీ కారు లేదా విమానం కొనిస్తానని కూడా చెబుతాడు. 
  • స్థిరీకరణ నిధి పెట్టి ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదని రైతులు బాబును నిలదీయాలి. 
  • రుణాలు మాఫీ కాక ఆత్మహత్యలు చేసుకోవడానికి మీరు కారణం కాదా అని  బాబును నిలదీయాలి. 
  • అప్పుడే వ్యవస్థలో విశ్వసనీయత వస్తుంది. బాగుపడుతుంది. ఈపోరాటం ఇంకా కొనసాగిస్తాం. 
  • బాబుకుఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కట్టాలని ఉందో లేదో అర్థం కావడం లేదు. ఒక్కో ప్రాజెక్ట్ కు ఒక్కో రేటు కట్టించడం అన్యాయం.
  • రైతులు గొడవ పడాలి. ఉద్యమాలు చేయాలి. వాళ్లు ఉద్యమిస్తున్నారు కాబట్టే నేను ప్రాజెక్ట్ లు చేయడం లేదని చెప్పేందుకు బాబు కుయుక్తులు పన్నుతున్నారు. 
  • పట్టిసీమ కింద రైతులకు రూ.30 లక్షలు ఇస్తే చింతపూడి కింద రూ.12 లక్షలే ఇస్తున్నారు. 
  • బాబు చేస్తున్న అన్యాయాలను గట్టిగా నిలదీయాలి. మన కడుపు మంట, బాధ ఇప్పటికైనా పాలకుల దృష్టికి పోతుందని ఆశిద్దాం. 
  • రైతుల పరిస్థితుల్లో మార్పు రాకపోతే జంగారెడ్డి గూడెంలో జరుగుతున్న ధర్నాకార్యక్రమాన్ని ఎక్కువగా చేస్తామని బోర్డు, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 
  • రైతులకు తోడుగా నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.  
 రైతులను ఆదుకునేదాకా ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని వైయస్ జగన్ స్పష్టం చేశారు. 


తాజా వీడియోలు

Back to Top